వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్..12 మంది మృతి

Fri,November 8, 2019 07:22 PM

చిత్తూరు: బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద కంటైనర్.. వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో, ద్విచక్రవాహనం, వ్యాన్‌లు కంటైనర్ కింద ఇరుక్కున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో స్కూటర్ దగ్ధమైంది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

729
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles