ఆ హీరో సినిమాలో హీరోయిన్ మారింది..!

Fri,August 4, 2017 02:57 PM

Lavanya Tripathi replaced by megha akash

నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో రామ్ తన 15వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఉన్నది ఒక్కటే జిందగీ అనే టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, ఆగస్ట్ 5న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. సెప్టెంబర్ 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలుగా ఎంపిక చేయగా, ఇప్పుడు మేఘా ఆకాశ్‌ స్థానంలో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. నితిన్ – హను రాఘవపూడిల ‘లై’ సినిమా కోసం యూఎస్ షెడ్యూల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు రామ్ సినిమాకు డేట్స్ కుదర్చలేకపోతోందట. దీంతో ప్రాజెక్ట్ డిలే కాకుండా లావణ్యని మేఘా ఆకాశ్ స్థానంలో తీసుకున్నారని టాక్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించనుండగా, సినిమాటోగ్ర‌ఫీ స‌మీర్ రెడ్డి , ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు.ఇటీవ‌ల వైజాగ్, హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగష్టు నుండి ఊటీ షెడ్యూల్ కు వెళ్లనున్న‌ట్టు స‌మాచారం.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles