జర్నలిస్టు ఆత్మహత్య

Sun,August 13, 2017 06:14 AM

journalist mohamed suicide in hussain sagar

హైదరాబాద్ : మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ జర్నలిస్ట్ హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన సయ్యద్ ఖాజిమ్ మహ్మద్(57) విశ్వాస్ న్యూస్ అనే ఆంగ్ల దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. గతంలో మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఓసారి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సయ్యద్‌ఖాజిమ్ మహ్మద్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉండగా శనివారం హుస్సేన్‌సాగర్‌లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో పోలీసులు దాన్ని బయటకు తీశారు. మృతుడి వద్ద ఐడీ కార్డు, ఇతర పత్రాల ఆధారంగా అతను సయ్యద్‌ఖాజిమ్ మహ్మద్ గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles