భార్యను వేధించిన భర్తకు రెండేండ్ల జైలు

Thu,September 19, 2019 06:45 AM

హైదరాబాద్: ప్రేమ పెండ్లి చేసుకొని.. 8 ఏండ్ల తరువాత తాగుడుకు బానిసై భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్తకు రెండేండ్ల జైలు శిక్ష, రూ. 4 వేల జరిమానా విధిస్తూ నగరంలోని మల్కాజిగిరి కోర్టు తీర్పు చెప్పింది. కుషాయిగూడకు చెందిన విజయ, నర్సయ్యలకు 12 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. 8 ఏండ్లు వీరి సంసారం బాగానే సాగింది, ఆ తరువాత నర్సయ్య తాగుడుకు బానిసై, భార్యను అనుమానిస్తూ ప్రతి రోజు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. విసిగిన ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. న్యాయస్థానం నర్సయ్యకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

1324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles