భార్య కాపురానికి రావడంలేదని...

Thu,June 6, 2019 07:04 AM

Husband got suicide due to wife in Hyderabad

హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో... మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింనగర్, గౌతమ్‌నగర్‌లో ఆర్.రాము(26), సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. రాము డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాము తరుచూ మద్యం సేవిస్తుండడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సురేఖకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నెలరోజుల క్రితం తల్లిదండ్రులు వచ్చి శామీర్‌పేటలోని పుట్టింటికి తీసుకువెళ్లారు. అప్పటినుంచి రాము ఎన్నిసార్లు పిలిచినా రావడంలేదు. రెండురోజుల క్రితం తమ పెళ్లిరోజు ఉందని, భార్యను పంపించాలని కోరినా ఒప్పుకోలేదు. మంగళవారం శామీర్‌పేటకు వెళ్లిన రాము అత్తామామ, బామ్మర్థితో ఇదే విషయంలో గొడవ పడి వచ్చాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురైన రాము బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు అత్తామామలు, బామ్మర్థి కారణమని సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తున్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

5071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles