తండ్రే హంతకుడా ?

Mon,July 22, 2019 07:41 AM

Girl found dead at Medchal was killed by her father

మేడ్చల్: మేడ్చల్‌లో సంచలనం రేకెత్తించిన యువతి హత్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఉదoతంలో తండ్రే కాలయముడుగా మారి హతమార్చాడని ఆరోపణలు వినిపిస్తున్నా? పోలీసులు మాత్రం ఇంకా నిర్ధ్ధారణ కాలేదని స్పష్టం చేస్తున్నారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నటు తెలుస్తున్నది. స్థానికులు కథనం ప్రకారం.. మచ్చబొల్లారం చెందిన సుబ్రహ్మణ్యం మొదటి భార్య మృతిచెందగా మరో యువతిని పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఒక కూతురు కాగా రెండో భార్యకు ఇద్దరు కొడుకులు. సుబ్రహ్మణ్యంపై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. అతను కుటుంబంతో అక్కడి నుంచి ఆరు నెలల కిత్రం మేడ్చల్‌కు వలస వచ్చి వెల్డర్‌గా పని చేస్తున్నట్లు తెలిపి పట్టణంలోని కిందిబస్తీలో కుమార్ అనే వ్యక్తి ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. మొదటి భార్య కూతురు (13) మేడ్చల్‌లో బాలికలు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నా ఎప్పుడు ఇంటి వద్దనే ఉంటూ చిన్న పిల్లలను చూసుకుంటూ ఉండేదని స్థానికులు తెలియజేస్తున్నారు. పలు వ్యసనాలకు బానిసైన తండ్రి ఉదయమే ఇంటి నుంచి వెళ్లి రాత్రి వచ్చేవాడు.

ఈ క్రమంలో అతడి రెండో భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నది. దీనిపై తండ్రి సమక్షంలోనే పిన్నిని బాలిక నిలదీసింది. దీంతో కక్ష పెంచుకున్న సవతి తల్లి బాలిక అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. బాలిక గురించి భర్తకు లేనిపోనివన్నీ నూరిపోసింది. ఇదే క్రమంలో తండ్రే శుక్రవారం రాత్రి ఆ బాలికను హత్య చేసి వారు ఉంటున్న ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో సంచిలో చుట్టి పడవేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం అందరిలో కలిసి తల్లి దండ్రులు ఘటనా స్థలానికి వచ్చి ఏమి తెలియనట్లు ఉండటాన్ని స్థానికులు జీర్ణించుకోలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చిన వారు ఇల్లును కడిగి 10 గంటల ప్రాంతలో తన కూతురు కనిపించడం లేదని పోలుసులకు తెలిజేయగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాలనీ వాసులు మాత్రం ఆదివారం ఉదయం అతడి ఇంటి ముం దు చేరి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. పోలీసులు మాత్రం హత్యకు గురైన యువతిని గుర్తించి విచారణ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు.

1045
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles