కెనడాలో ఉద్యోగమంటూ లక్షలు టోకరా

Wed,August 8, 2018 07:57 AM

Fraud in the name of jobs in Canada

హైదరాబాద్: కెనడాలో ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తికి సైబర్‌ చీటర్లు రూ. 7.66 లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని భోలక్‌పూర్, కృష్ణానగర్‌కు చెందిన శ్రీకాంత్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇందులో భాగంగా విదేశాల్లో సూపర్‌వైజర్ ఉద్యోగం కోసం క్వికర్.కామ్‌లో తన బయోడేటాను అప్‌లోడ్ చేశాడు. దీన్ని చూసిన జేమ్స్ అనే వ్యక్తి శ్రీకాంత్‌కు ఫోన్ చేసి, మూడు రౌండ్ల టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇంటర్వ్యూ లో సెలక్ట్ అయ్యావు, వీసా, వర్క్ పర్మిట్ కోసం అయ్యే ఖర్చు నీవే భరించాలంటూ చెప్పగా .. శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. దీంతో సంబంధిత డాక్యుమెంట్లు పంపించాడు. ఆ తరువాత విమాన టికెట్లు కూడా బుక్ చేశామంటూ టికెట్లను స్కాన్ చేసి ఈ-మెయిల్ చేశారు. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు, వర్క్‌పర్మిట్ చార్జీలు, యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్, ఇమ్మిగ్రేషన్ క్లియెరెన్స్ పేరిట రూ. 7,66,900 లక్షలను వివిధ బ్యాంకుల్లో శ్రీకాంత్ డిపాజిట్ చేశాడు. డబ్బు డిపాజిట్ అయిన తరువాత సైబర్ చీటర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఇంతలో ఇండియన్ వీసా ఆఫీసర్‌ను అంటూ ఫోన్ చేసి మీరు చండీఘఢ్ నుంచి కెనాడకు వెళ్లండంటూ సూచించాడు. దీంతో ఈ నెల 1న వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే కెనడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ఇదంతా మోసమని తేలింది. దీంతో బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles