వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం

Mon,January 21, 2019 08:46 AM

four people missing at different locations in hyderabad

మెహిదీపట్నం: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ మన్సూర్‌అలీ కథనం ప్రకారం.. టోలిచౌకి అల్‌హస్నత్ కాలనీలో నివసించే సైరా అయిమన్(23) అమీర్‌పేట్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ ఉద్యోగం చేస్తున్నది. ఈ నెల 17న ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరో సంఘటనలో..

మెహిదీపట్నం అజీజియా మసీదు సమీపంలో నివసించే అమృతమ్మ(24) నిమ్స్ దవాఖానలో నర్సుగా పని చేస్తున్నది. ఈ నెల 17న ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గోల్నాకలో..

గోల్నాక : ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ టి.మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంటకు చెందిన ఎం.వెంకటేశ్ కూతురు ఎం.ప్రియాంక(19) ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. కాగా, గత శనివారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఆమె ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. తెలిసిన వారందరినీ ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి తండ్రి వెంకటేశ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దోమలగూడలో..

దోమలగూడ : మహిళ అదృశ్యమైనన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి జవహర్‌నగర్‌లో బన్వీర్‌సింగ్, ఉషా(31) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం 9:30 గంటలకు ఉషా బయటకు వెళ్తున్నానని భర్త బన్వీర్‌సింగ్‌కు చెప్పి వెళ్లి ఎంతకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త కుటుంబ సభ్యులు, స్థానికుల ఇండ్లల్లో వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో ఆదివారం బన్వీర్‌సింగ్ తన భార్య అదృశ్యమైనట్లు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

2215
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles