రౌడీ షీటర్‌ హత్య కేసు..నిందితులు అరెస్ట్

Thu,August 16, 2018 08:22 PM

Four members arrested in Peddapally Rowdy sheeter murder case

పెద్దపల్లి: గోదావరిఖనిలో ఈ నెల 8న పాత కక్షలకు సంబంధించి జరిగిన రౌడీషీటర్ ధనాల శివశంకర్ అలియాస్ చిన్న హత్య కేసులో నిందితులను పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను ఏసీపీ క్రిష్ణమూర్తి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ఏసీపీ క్రిష్ణమూర్తి మాట్లాడుతూ..స్థానిక హనుమాన్ నగర్ కు చెందిన రౌడీషీటర్ ధనాల శివశంకర్ అలియాస్ చిన్నతో మంథని సుమన్, సర్వేశ్, శ్రీకాంత్‌లకు గతంలో పాత కక్ష్యలున్నాయి. ఈ క్రమంలో వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో రెండు వర్గాలుగా ఏర్పడిన ఇరువురు అవకాశం కోసం ఎదురు చూశారు. రౌడీషీటర్ శివశంకర్ ఆగస్టు 8న పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. బర్త్ డే జరిగిన తర్వాత హనుమాన్ నగర్ లోని మద్యం దుకాణం వద్దకు తన మిత్రులతో కలిసి వెళ్లిన శివశంకర్ పై.. మంథని సుమన్ తో పాటు శ్రీకాంత్, సర్వేశ్, శ్రావన్, పవన్ లు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ క్రిష్ణమూర్తి తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

2742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles