కారులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

Sat,September 14, 2019 09:56 AM

Five members were burned alive in Chittoor dist

చిత్తూరు : జిల్లాలోని గంగవరం మండలం మామడుగు సమీపంలో విషాదం నెలకొంది. కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం అయ్యారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా కారులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా తిరుపతివాసులు అని పోలీసులు తెలిపారు. మృతులను జాహ్నవి, కళ, భానుతేజ, పావనరామ్‌, సాయి అశ్రితగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడిని విష్ణుగా గుర్తించారు పోలీసులు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

2792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles