కారు ఢీకొని ఐదుగురు మృతి..

Sun,November 17, 2019 09:33 PM

నిజామాబాద్: వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఆటోను ఢీకొట్టగా.. ఆటోలోని నలుగురు ప్రయాణీకులు సహా డ్రైవర్ మరణించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం, ఠానాకలన్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు బాధితులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు.. జక్కం గంగమ్మ(65), జక్కం బాలమణి(55), కల్లెపురం సాయిలు(70), చిక్కేల సాయిలు(60). కాగా, తీవ్రగాయాల పాలైన ఆటోడ్రైవర్ నయీమ్(35) చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలోనే మరణించాడు. ఈ వార్త అక్కడున్న వారినందరినీ కలిచివేసింది. దర్గా ఉత్సవాలకు తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగినట్లు నయీమ్ చివరి క్షణాల్లో తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే మృతుల కుటుంబాలకు సమాచారం అందిస్తామని పోలీసులు తెలిపారు.

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles