బోగత జలపాతంలో మునిగి విద్యార్థి మృతి

Sat,July 9, 2016 09:17 PM

వాజేడు : ఖమ్మంజిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న బోగత జలపాతంలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. పాల్వంచ పట్టణానికి చెందిన ధారవత్ పవన్‌కుమార్(18)తన స్నేహితులతో కలసి విహార యాత్రకు వచ్చాడు. నలుగురు స్నేహితులు కలసి జలపాతం వద్ద ఈత కొడుతున్న క్రమంలో పవన్‌కుమార్ నీటిలో గల్లంతైనాడు. మిగతా స్నేహితులు వెతికినా లాభం లేకపోయింది. పవన్ కొత్తగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న వాజేడు ఎస్సై సట్ల కిరణ్‌కుమార్,పేరూరు ఎస్సై శివప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకోని స్నేహితుల వద్ద వివరాలు సేకరించారు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles