విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ హత్య

Wed,September 18, 2019 08:59 AM

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ శ్రీనివాస్‌ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. శ్రీనివాస్ స్వస్థలం ఇల్లంతకుంట మండలం వంతదుపుల గ్రామం. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి..
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ బస్ డిపో ఎదుట జాతీయ రహదారిపై ప్రమాదం సంభవిచింది. లారీ ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles