సరికొత్త కథాంశంతో మారుతి ‘బ్రాండ్ బాబు’

Mon,July 9, 2018 11:49 AM

Director Maruthi is back with brand babu movie

హైదరాబాద్: మతిమరుపు, జాలి వంటి అంశాలను తీసుకుని ఇప్పటికే రెండు సినిమాలను తెరకెక్కించాడు డైరెక్టర్ మారుతి. భలే భలే మగాడివోయ్ సినిమాలో నానిని మతిమరుపు పాత్రలో చూపించగా..బాబు బంగారం చిత్రంలో వెంకీని జాలి గుణం కలిగిన పోలీసాఫీసర్ పాత్రలో చూపించాడు. మారుతి ఈ రెండు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

తాజాగా ఈ డైరెక్టర్ మరో కొత్త కథాంశంతో కూడిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. మానసిక సమస్య (సైకలాజికల్ సిండ్రోమ్)తో బాధపడుతున్న వ్యక్తికి సంబంధించిన కథాంశంతో సినిమా తీసేందుకు సిద్దమయ్యాడు మారుతి. అయితే మారుతి ఈ సినిమాతో ప్రభాకర్.పీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుమంత్ శైలేంద్ర (తొలి పరిచయం) హీరోగా నటించనున్నాడు. శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

1623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles