యువ ఇంజినీర్ గొంతు కోసిన చైనా మాంజా

Sat,August 17, 2019 04:04 PM

Delhi Man On Two-Wheeler Dies After Chinese Kite String Slits His Throat

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. చైనా మాంజా ఓ యువకుడి ప్రాణం బలిగొంది. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో రక్షా బంధన్ రోజునే విషాదం చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన బంధువులు ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

'రక్షా బంధన్ సందర్భంగా తన చెల్లెళ్లతో 28ఏండ్ల మానవ్ శర్మ రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం హరీ నగర్‌లో గల తమ అత్తమ్మ ఇంటికి ఇద్దరు చెల్లెళ్లతో కలిసి స్కూటర్‌పై వెళ్తున్నాడు. పశ్చిమ విహార్ ైఫ్లెఓవర్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా మానవ్ మెడకు చుట్టుకొని గొంతుకు చుట్టుకుంది. మెడలోని శ్వాసనాళం కూడా తెగిపోవడంతో వెంటనే బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఐతే తన ఇద్దరు చెల్లెళ్లు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. బుద్ధ విహార్‌కు చెందిన మానవ్ ఓ ప్రైవేట్ బిల్డర్ దగ్గర సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని' పోలీసులు పేర్కొన్నారు. గత గురువారం చైనా మాంజాలపై ఢిల్లీ పోలీసులకు సుమారు 15కు పైగా ఫోన్‌కాల్స్ రావడం గమనార్హం. మాంజాల వల్ల ఎనిమిది గాయపడినట్లు గుర్తించారు.

2065
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles