రామ్ ప్రసాద్‌ను నలుగురు కలిసి హత్య చేశారు..: డీసీపీ

Mon,July 15, 2019 04:54 PM

dCP Srinivas Rao Press Meet On Businessman Ram Prasad Case

హైదరాబాద్: వ్యాపారవేత్త రామ్ ప్రసాద్ హత్యకేసులో కోగంటి సత్యం ప్రధాన నిందితుడని, ప్రసాద్ హత్యకు భూ వివాదమే కారణమని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్‌ శ్రీనివాసరావు వివరించారు. రామ్ ప్రసాద్ హత్యకు నెల రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని స్పష్టం చేశారు.

రామ్ ప్రసాద్ హత్యకేసు వివరాలను డీసీపీ వెల్లడిస్తూ.. పరిగిలో రామ్ ప్రసాద్‌కు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. రామ్‌ప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్ల పాటు కలిసి వ్యాపారం చేశారు. రామ్ ప్రసాద్‌ను నలుగురు కలిసి హత్య చేశారు. సత్యం, ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించాం. శ్యామ్, మరో ఇద్దరు కలిసి రామ్ ప్రసాద్‌ను హత్య చేశారు. తనపై ఎవరికీ అనుమానాలు రాకుండా రామ్ ప్రసాద్‌ను హత్య చేయించాలని సత్యం భావించాడు. హత్య సమయంలో సత్యం యశోదా ఆస్పత్రి వద్ద ఉన్నాడు. హత్యను నిర్ధారించుకునేందుకు సత్యం అక్కడే ఉన్నాడు. హత్య ఎవరు చేసినా.. ప్రధాన సూత్రధారి కోగంటి సత్యం అని డీసీపీ పేర్కొన్నారు.

కోగంటి సత్యంతో ఉన్న విభేదాల వల్లే రామ్ ప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్‌కు వచ్చారని డీసీపీ చెప్పారు. రామ్ ప్రసాద్ హత్యకు రూ.10లక్షలు సుపారీ ఇచ్చేందుకు సత్యం ఒప్పుకున్నట్లు తెలిసింది. రామ్ ప్రసాద్ హత్యకేసులో 11 మంది నిందితులు. ఐదుగురిని అరెస్ట్ చేశాం, మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నాం. మీడియా, పోలీసులను నిందితులు తప్పుదోవ పట్టించారు. సత్యంపై 21 కేసులు ఉన్నాయని తెలిపారు.

1123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles