చిన్న పొరపాటు.. రూ.32 లక్షలు మాయం

Wed,August 14, 2019 07:13 AM

cybercriminals are adopting newer ways to steal money

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఓ కంపెనీ మెయిల్‌ను హ్యాక్ చేసి బోల్తా కొట్టించారు. అక్షరం తేడాతో జరిగిన ఈ పొరపాటు కంపెనీకి 32 లక్షల రుపాయాలు నష్టం జరిగింది. ఈ మోసం ఇటీవల రాచకొండ సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతంలోని రెప్రొగ్రాఫిక్స్ ప్రైవేటు లిమిటడ్ కంపెని అమొనియా (బ్లూ ప్రింట్) కాపీలను తయారు చేస్తుంది. ఈ బ్లూ ప్రింట్‌లు తయారు చేసేందుకు అవసరమైయ్యే రసాయనాలను చైనా దేశంలోని హైహ్యాంగ్ ఇండస్ట్రీ నుంచి గత 18 నెలల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

ఈ నేపథ్యంలో జూన్ 12వ తేదీన రసాయానాలు కావాలంటూ చైనా కంపెనీకి మెయిల్ ద్వారా దిగుమతికి ఆర్డర్ ఇచ్చింది. కంపెనీ వారు వెంటనే ఇన్‌వాయిస్ పత్రం మెయిల్‌లో పంపించి నగదు డిపాజిట్ చేయాల్సిన బ్యాంక్ ఖాతా, పేరు తదితర వివరాలను పంపింది. అదే రోజు మరో మెయిల్ కంపెనీకి వచ్చింది. మేము మా కంపెనీ బ్యాంక్ ఖాతాను మార్చాం మొదట మెయిల్ పంపిన బ్యాంక్ ఖాతాకు కాకుండా తాజాగా మెయిల్‌లో వచ్చిన బ్యాంక్ ఆఫ్ స్కాట్ ల్యాండ్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఇది నిజమే అనుకున్న రెప్రొగ్రాఫిక్స్ కంపెనీ వారు బ్యాంక్ ఆప్ స్కాట్ ల్యాండ్ బ్యాంక్ ఖాతాలో 4675 డాలర్లు(మన కరెన్సిలో 32 లక్షలు)లను డిపాజిట్ చేశారు. అనంతరం చైనా కంపెనీ నుంచి ఏలాంటి జవాబు రాకపోవడంతో డిపాజిట్ చేసిన బ్యాంక్ ఖాతాతో పాటు వచ్చిన మెయిల్‌ను సరిచూసుకున్నారు. దీంతో రెండో సారి వచ్చిన మెయిల్ నకిలీదిగా గుర్తించి మోసపోయామని కంపెనీ సిబ్బంది రాచకొండ సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది.

2317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles