అలా మాట్లాడి.. ఇలా ముంచుతున్నారు..!

Mon,August 26, 2019 06:49 AM

Cyber fraud cases  rises across Telangana

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దోచుకోవడానికి కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అమాయకులను మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. రోజుకొక మోసం వెలుగులోకి వస్తున్నది. జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగమని ఆశపెట్టి ఓ వ్యక్తిని నిండా ముంచారు. జాబ్ ఐడీ, వెరిఫికేషన్ ఇలా వివిధ అంశాలు పేర్కొంటూ.. మొత్తం రూ. 9,84,510 కాజేశారు. హిమాయత్‌నగర్‌కు చెందిన వ్యాపారి పెట్రోల్ బంక్ కోసం సైబర్ నేరగాళ్ల వెబ్‌సైట్ అని తెలియక దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 8.55 లక్షలు పంపించాడు. నిందితులు ఈ-మెయిల్స్ ద్వారా డబ్బు అందినట్లు రసీదు పంపించారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే...నాలుగు వారాల నుంచి ఫోన్లు స్విచ్‌ఆఫ్ ఉండడం, వెబ్‌సైట్ కూడా పనిచేయకపోవడంతో బాధితుడు తలపట్టుకున్నాడు. ఓ స్థలం కోసం ఇచ్చిన ప్రకటన అగంతకుడికి కలిసొచ్చింది. ఆ ప్రకటన అవకాశంగా మల్చుకొని.. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను బోల్తా కొట్టించాడు.

ఓ స్థలం యజమాని ప్రకటన సైబర్ నేరగాళ్లకు కలిసొచ్చింది. ఆ ప్రకటన అవకాశంగా మార్చుకుని స్కెచ్ వేసి ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు టోకరా కొట్టాడు. కేవలం వాట్సాప్‌లోనే రియల్ దందాను నడిపించి రూ.3.50 లక్షలను దోచేశాడు. మోసపోయిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఓ లేఅవుట్‌లో 300 గజాల స్థలం అమ్ముతున్నట్లు దినపత్రికల్లో ప్రకటనను వేశారు. దీనిని చూసి ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థల యజమానికి ఫోన్ చేసి మీ ప్లాట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నానని వివరించి వాట్సాప్‌లో స్థలానికి సంబంధించిన పత్రాలను పంపిస్తే వాటిని పరిశీలించుకుని మీకు అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పాడు.

ప్రస్తు తం తాను బెంగళూరు లో ఉన్నాను వెంటనే వచ్చి డీల్ క్లోజ్ చేద్దామని మాట్లాడాడు. దీంతో స్థల యజమా ని గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మి వాట్సాప్‌లో స్థలానికి సం బంధించిన అన్ని పత్రాలను పం పాడు. ఈ పత్రాలతో గుర్తు తెలియని వ్యక్తి ఘట్‌కేసర్ పరిధిలోని ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు ఈ పత్రాలను వాట్సాప్‌లో పంపితా ను బెంగళూరులో ఉంటాను ఈ స్థలాన్ని అ మ్మాలనుకుంటున్నాను మార్కెట్‌ధర ఎం త ఉంది అని అడిగాడు. అత్యాశకు గురైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ మూడు నెలల కిందట వరకు మార్కెట్ ధర ఇక్కడ 15 వేల వరకు ఉంది. ఈ మధ్య మార్కెట్ పడిపోవడంతో ఇప్పుడు 8 వేల రుపాయాలు గజం ఉందన్నాడు. సరే ఒక్కసారి ఈ పేపర్లతో ఎైంక్వెరీ చేసుకో చివరి ధర ఏం ఇస్తావు ఫోన్ చేసి చెప్పమన్నాడు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.6 వేలు ఇస్తానన్నాడు. ఓకే అనడంతో ఖుషీ అయిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ తనకు గజం రూ.5 వేలు మిగులుతుంది మంచి జాక్‌పాట్ అనుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి వెంటనే ఫోన్ చేసి అడ్వా న్సు కింద నాకు రూ.9 లక్షలు ఇవ్వండని అడిగాడు. ఇప్పుడు అంతా డబ్బులేదనడంతో అపరచిత వ్యక్తి పోని అత్యవసరంగా నాకు లక్ష రుపాయాలు బ్యాంక్ ఖాతాలో వేయండని ఓ ఖాతా నెం బరు పంపించాడు. భారీ లాభం ఆశలో ఉన్న ఏజెం ట్ వెంటనే లక్షల రుపాయా లు వేశాడు.

మరో మూడు మరికొంత డబ్బు వేస్తానని అన్నాడు. మూడు రోజుల తర్వాత మరో ఖాతాను పంపించిన ఆ వ్యక్తి పాత ఖాతా కు డబ్బు వద్దు మరో ఖాతా పంపించాను అందులో వేయండని అడిగాడు. దీంతో ఏజెంట్ మరో రూ.2.50 లక్షలు వేశాడు. ఇంకా డబ్బు కావాలని అడుగుతుండడంతో అనుమానం వచ్చి మీరు ఒరిజినల్ పత్రాలను తీసుకుని వస్తే మొత్తం డబ్బు ఇస్తానని చెప్పా డు. అంతే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మోసపోయానని తేరుకున్న ఏజెంట్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్‌లోనే వ్యాపారం, ముందస్తుగా డబ్బులు అడిగితే తస్మాత్ జాగ్రత్తా అది కచ్చితంగా మోసమని గుర్తు పెట్టుకోవాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి డబ్బులు పోతే ఉరికనే రావని ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు.

పెట్రోల్‌బంక్ కోసం ఇంటర్‌నెట్‌లో దరఖాస్తు

పెట్రోల్ బంక్ పెట్టాలనే ఆలోచనతో ఇంటర్‌నెట్‌పై ఆధారపడ్డ ఓ వ్యాపారి సైబర్ ఛీటర్ల చేతిలో చిక్కి రూ. 8.55 లక్షలు మోసపోయాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక వ్యాపారీ కర్నూల్ ప్రాంతంలో పెట్రోల్ బంక్ పెట్టాలనుకున్నాడు. ఇంటర్‌నెట్‌లో పెట్రోల్ బంక్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండగా రిలయన్స్ పెట్రోలియం.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్ కన్పించింది. దీనిని చూసిన సదరు వ్యాపారి అది నిజమైందే అనే భావనతో అందులో ఉన్న ఫారాన్ని నింపి, నిఫ్ట్, ఆర్టీజీఎస్‌లో డబ్బు పంపించవచ్చనే సూచనలు పాటించారు. ఇలా నాలుగు దఫాలుగా, నాలుగు బ్యాంకు ఖాతాలోకి రూ.8.55 లక్షలు పంపించారు. డబ్బు పంపించగానే సైబర్ నేరగాళ్లు ఈమెయిల్స్ ద్వారా డబ్బు వచ్చినట్లు రసీద్ పంపించారు. నాలు గు వారాల నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండడం, వెబ్‌సైట్ కూడా పనిచేయకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

జెట్ ఎయిర్‌వేస్‌లో కొలువొచ్చిందంటూ

ఇంజినీరింగ్ చేసిన ఒక యువకుడు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కాడు.. జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగమనగానే వెనుకా ముందు ఆలోచించకుండా సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు డబ్బు డిపాజిట్ చేస్తూ వెళ్లాడు. ఇలా ఆరు నెలలకుపైగా ఉద్యోగమిస్తున్నామంటూ ఆశ చూపుతూ రూ. 9,84,510 బాధితుడి వద్ద నుంచి కాజేశారు. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రాజు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రైవేట్ ఉద్యోగంలో చేరి మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.. ఇందులో భాగంగా షైన్.కామ్‌లో తన బయోడెటాను అప్‌లోడ్ చేశాడు. గతేడాది సెప్టెంబర్ 13వ తేదీన రిచాశర్మ అనే మహిళా ఫోన్ చేసి మీరు జెట్ ఎయిర్‌వేస్‌లో గ్రౌండ్‌స్టాప్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.. జాబ్ ఐడీ కోసం రూ.1600 చెల్లించాలంటూ సూచించింది. చిన్న మొత్తమే కదా అని ఆ డబ్బు చెల్లించాడు. తర్వాత వెరిఫికేషన్ కాల్ అంటూ ఫోన్ చేసి రూ.7200 వసూలు చేశారు. జాబ్ సెక్యూరిటీ కోసం రూ.16500, శిక్షణ కోసం రూ.32500 అంటూ రెండు మూడు రోజులకోసారి ఫోన్ చేసి డబ్బు డిపాజిట్ చేయించుకున్నారు.

ఈ ఉద్యోగంలో మీ జీతం రూ.39,200తో ప్రారంభమవుతుందని, త్వరగానే అది రెట్టింపవుతూ వెళ్తుందంటూ నమ్మించారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, జీఎస్టీ, మీకు వీసా ఉండాలంటూ ఆరు నెలలకుపై సైబర్‌ఛీటర్లు ఫోన్లు చేస్తూ రూ.9.84 లక్ష కాజేశారు. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ ఫోన్లు వస్తుండడంతో ఇదం తా మోసమని గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles