కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య

Sun,January 22, 2017 10:27 PM

couple suicide in Wanaparthy District

వనపర్తి : వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం రేమొద్దుల గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రేమొద్దుల గ్రామానికి చెందిన ప్రహ్లాద్(28), మల్లమ్మ(24) భార్యాభర్తలు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడాదిన్నర వయస్సున కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో కొద్దిరోజుల నుంచి కలహాలు మొదలయ్యాయి. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరి మధ్య శనివారం గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్యాభర్తలిద్దరూ గ్రామ సమీపంలోని గొల్లకుంట ఇసుక వాగులోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషయాన్ని గొర్రెల కాపరి జగపతి ఆదివారం ఉదయం గుర్తించి గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. తల్లిదండ్రుల ఆత్మహత్యతో చిన్నారి అనాథ అయ్యాడు.

1023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles