పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

Sat,March 30, 2019 07:31 PM

couple committed suicide drinking pesticides in vikarabad district

వికారాబాద్: జిల్లాలోని ధారూర్ మండలం అల్టీపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శీతలపానీయంలో పురుగుమందు కలుపుకుని తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను పరిగి మండలం రాఘవాపూర్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.
మూలవాగు బావిలో రెండు మృతదేహాలు..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ మూలవాగు బావిలో రెండు గుర్తుతెలియని మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులిద్దరూ మహిళలుగా భావిస్తున్నారు. మృతదేహాలను బావినుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. పట్టణ సీఐ వెంకటస్వామి కేసు విచారణ చేపట్టారు.

4116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles