సిగరేట్ కావాలని వచ్చి... చైన్ స్నాచింగ్

Sun,February 17, 2019 06:47 AM

chain snatching at Rajendra nagar in rangareddy district

రంగారెడ్డి: సిగరేట్ పేరుతో దుకాణానికి వచ్చి యజమాని మెడలో నుంచి గొలుసును లాక్కెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అత్తాపూర్ డివిజన్, న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నివాసముండే రాఘవరెడ్డి మైత్రీ కిరాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శనివారం మధ్యాహ్నం రాఘవరెడ్డి దుకాణంలో ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి సిగరేట్ కావాలన్నాడు. సిగరేట్ ఇచ్చేలోపే అతని మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles