అంబులెన్స్‌కు దారివ్వని టీడీపీ నేతలపై కేసు

Sat,October 6, 2018 07:34 AM

case against TDP leaders who do not lead to ambulance

హైదరాబాద్ : ప్రధాన రోడ్డుపై అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడంతో పాటు దిష్టిబొమ్మను దహనం చేసిన టీడీపీ నాయకులపై హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నామాలగుండులో టీడీపీ నేతలు ఎలాంటి అనుమతి లేకుండా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రధాన రోడ్డుపై అంబులెన్స్ వెళ్తున్నా దారి ఇవ్వకపోవడం... నామాలగుండు టీఆర్‌ఎస్ కార్యాలయం ముందే సీఎం దిష్టి బొమ్మను కాల్చడం, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేత మేకల సారంగపాణితో పాటు ఇతర నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఎం.రంగాచార్యులు, బాలాజీ నాయక్‌ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

4951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles