ఆటోను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి గాయాలు

Wed,October 23, 2019 06:55 PM

సూర్యాపేట్‌: ముందు వెళ్తున్న ఆటోను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. మునగాల మండలం మాదవరం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు వెనుక నుంచి బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భాదితులు మహబూబ్‌నగర్‌ జిల్లా, బృందావనపురం గ్రామస్తులుగా తెలిసింది. వారు నిమ్మకాయలు తెంపడానికి కూలీకి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles