బలవంతంగా వ్యభిచారంలోకి దించేందుకు యత్నం

Sun,June 16, 2019 07:06 AM

Attempt to bring down forced into prostitution

హైదరాబాద్ : పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన ఒక మహిళను అర్ధరాత్రి కొందరు యువతులు, యువకులు కలిసి దాడి చేశారు. తాను డ్యాన్సర్‌గా పబ్బులో పనిచేస్తున్నానని, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు ఒక ముఠా ప్రయత్నించిందని, అందుకు తాను నిరాకరించడంతో దాడి చేసిందంటూ సదరు యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకా రం... గుంటూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత కొంతకాలం క్రితం భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి కృష్ణానగర్‌లో నివసిస్తుంది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కంట్రీ క్లబ్ పక్కన ఉన్న లిస్బన్ పబ్బులో జనవరిలో బార్ డ్యాన్సర్‌గా చేరింది. కాగా... గత అర్నెళ్లుగా తరచూ పబ్బుకు వచ్చే బీఎస్ మక్తాకు చెందిన రితికా, బాలానగర్‌కు చెందిన స్వీటి, మణికొండకు చెందిన మధు అలియాస్ రేఖ, సూర్యాపేట, బొడ్రాయిబజార్‌కు చెందిన విజయా రెడ్డి, మెహిదీపట్నంకు చెందిన సయ్యద్‌లు సదరు వివాహితతో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు చాలాసార్లు విఫలయత్నం చేశారు. వారి వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా, అది జీర్ణించుకోలేని ఆ ఐదుగురు పబ్‌కు వచ్చిన ఆమెపై దాడి చేసి కొట్టారు. ఆమెను వివస్త్రను చేసి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి నలుగురు యువ తులను అరెస్ట్ చేశారు. మరోనిందితుడు సయ్యద్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

5553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles