ఆరుగురు దొంగల అరెస్ట్‌..

Wed,October 16, 2019 06:05 PM

హైదరాబాద్‌: గత కొంతకాలంగా సిటీలోని ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మీర్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌ డీఎస్పీ సంప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను ముందుగానే పరిశీలించి, గస్తీ కాసిన దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారనీ, వారి కోసం పోలీసు బృందాలు విపరీతంగా గాలించాయని ఆయన తెలిపారు. ఎట్టకేలకు ఇవాళ వారిని మా పోలీసు బృందం చాకచక్యంగా పట్టుకొని, అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో చాలా వరకు దొంగతనాలకు చెక్‌ పెట్టినట్లయిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పోలీసులు మీకు అండగా ఉంటారని ప్రజలనుద్ధేశించి డీఎస్పీ తెలిపారు.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles