రైల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Thu,October 10, 2019 07:07 AM

మారేడ్‌పల్లి : రైల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్-సికింద్రాబాద్ డెమో రైల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తరువాత ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుsడికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదన్నారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

1399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles