మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

Fri,February 22, 2019 06:57 AM

హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ట్రాంక్విల్ యూని సెక్స్ సెటూన్ అండ్ స్పా సెంటర్ గుట్టును నగరంలోని తుకారాంగేట్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ దాడిలో ఐదుగురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం... ఈస్ట్ మారేడుపల్లిలోని ట్రాంక్విల్ యూని సెక్స్ సెటూన్ అండ్ స్పా అనే పేరుతో మసాజ్ సెంటర్‌ను ఆర్గనైజింగ్ మేనేజర్ రాజేష్‌కుమార్(30), సబ్ ఆర్గనైజర్లు మన్నపు శ్రావణ్‌కుమార్(28), ఎల్క విద్యాసాగర్(26)లు నిర్వహిస్తున్నారు. ఇందులో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి సీఐ అశోక్, కానిస్టేబుళ్లతో కలిసి మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈక్రమంలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఐదుగురు యువతులు, ఇద్దరు విటులు, ఆర్గనైజర్ రాజ్‌కుమార్, ఇద్దరు సబ్ ఆర్గనైజర్లు శ్రావణ్‌కుమార్, విద్యాసాగర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి యువతులను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి 8 సెల్‌ఫోన్‌లు, రూ.13,040 నగదును స్వాధీనం చేసుకున్నారు.

3909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles