కల్తీ కొబ్బరినూనె తయారీ గుట్టురట్టు..

Wed,February 17, 2016 06:58 AM

adulterated coconut oil Manufacturing unit

చందానగర్ : కల్తీ కొబ్బరినూనె తయారు చేస్తున్న ఓ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల ఆకస్మిక దాడులతో గుట్టురట్టయ్యింది. ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సీఐ గంగాధర్ నేతృత్వంలో సిబ్బంది మియాపూర్‌లోని ఓ కల్తీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు రూ.రెండు లక్షల విలువైన వస్తు సామగ్రిని సీజ్ చేశారు. వివరాలు సీఐ గంగాధర్ కథనం ప్రకారం.. మియాపూర్ జయప్రకాష్‌నగర్‌లో కల్తీ కొబ్బరినూనె కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకులు ఇంద్రాఅగర్వాల్, పంకజ్ అగర్వాల్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేంద్రంలోని కల్తీ నూనెతో పాటు డబ్బాలను సీజ్ చేశారు.

అయితే నిర్వాహకులు చాలా కాలంగా మహాగోల్డ్ పేరిట కొబ్బరినూనె డబ్బాలను తయారు చేసి వాటిలో కొబ్బరినూనెతో పాటు పామాయిల్, మరో నూనెను కలిపి నింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మహాగోల్డ్ పేరిట ట్రేడ్ లైసెన్స్‌లు గానీ, ప్రభుత్వ గుర్తింపుగానీ లేవని వారు తెలిపారు. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని, ఈ కేసులో కాస్మోటిక్ అండ్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లను సైతం భాగస్వామ్యం చేయనున్నామన్నారు. అయితే ఈ కల్తీ కేంద్రం మూడు రోజుల క్రితమే బొల్లారం నుండి మియాపూర్‌కు మకాం మార్చడంతో ఎస్‌ఓటీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కల్తీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles