ప్రేమను నిరాకరించినందుకు..యువతితోపాటు ఆమె తల్లిపై..

Mon,April 15, 2019 06:58 AM

బంజారాహిల్స్: ఓ యువ‌కుడి ప్రేమను నిరాకరించిన యువతితోపాటు ఆమె తల్లిపై దాడి చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం.10(సి)లోని స్రవంతినగర్‌లో నివాసముంటున్న శ్రీనివాస్‌రెడ్డి(31)అనే యువకుడు, అదే ప్రాంతంలో ఉంటున్న యువతి(26) ఇద్దరు స్థానిక ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ శ్రీనివాస్‌రెడ్డి వెంటపడుతున్నా ఆమె నిరాకరిస్తూ వస్తున్నది. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఆమె ఇంటికి వెళ్లాడు. యువతి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి సుజాతతో గొడవపడి గాయపర్చాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న యువతిపై కూడా శ్రీనివాస్‌రెడ్డి దాడి చేయడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారు భయంతో కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకోవడంతో శ్రీనివాస్‌రెడ్డి పారిపోయాడు. గాయపడ్డ తల్లీకూతుళ్లను స్థానికులు దవాఖానలో చేర్పించారు.


బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ప్రేమించిన యువతి దక్కలేదన్న కోపంతో దాడికి పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాడి కేసు విషయమై గాలించే క్రమంలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి సోదరుడికి ఫోన్ చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

5636
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles