విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు

Tue,October 17, 2017 06:48 AM

9th class girl student harass by school principal

హైదరాబాద్ : బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసిన సంఘటన కుల్సుంపూర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కుల్సుంపూర ఇన్స్‌పెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(40) తన కూతురును పూనమ్ లక్ష్మీనర్సింహనగర్‌లోని గురుకుల్ ది స్కూల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిస్తున్నాడు. కాగా మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడాన్ని గమనించిన తండ్రి ఎందుకని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రైవేట్‌గా మాట్లాడాలని వేధిస్తున్నారని బాలిక తండ్రికి తెలిపింది. పాఠశాల గదిలో అభ్యంతరకరంగా కూర్చోబెడుతున్నారని వివరించింది. దీంతో తండ్రి సోమవారం ప్రిన్సిపాల్‌పై కుల్సుంపూర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కుల్సుంపుర పోలీసులు కేసు నామేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై గోవర్థన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles