నానమ్మను తిట్టాడని చంపేశాడు..Sat,August 12, 2017 09:40 PM
నానమ్మను తిట్టాడని చంపేశాడు..

జగిత్యాల : మేడిపల్లి మండలంలోని పోరుమల్ల అనుబంధ గ్రామమైన గుండ్లపల్లిలో ఓ వృద్దుడి గొంతు నులిమి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా శనివారం ఉదయం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంక పెద్ద రాజయ్య అలియాస్ కొంక పెద్ద నర్సయ్య(65) ఇల్లు, కొంక లస్మవ్వ ఇల్లు ప్రక్కక్కనే ఉన్నాయి. ప్రతి రోజు పెద్ద రాజయ్య కల్లు త్రాగి వచ్చి కొంక లస్మవ్వను తిడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా కొంక పెద్ద రాజయ్య త్రాగి వచ్చి లస్మవ్వను తిట్టాడు. దీంతో ఆమె మనుమడు కొంక శేఖర్ ఎందుకు తిడుతున్నావని రాజయ్యతో ఘర్షణకు దిగాడు. ప్రతి రోజు తిడుతుండడంతో జీర్ణుంచుకోలేని శేఖర్ అదే రోజు రాత్రి పెద్ద రాజయ్య గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు.

శనివారం ఉదయం సంఘటనా స్థలానికి మెట్‌పల్లి సీఐ సురేందర్, కోరుట్ల స్‌ఐ కృష్ణకుమార్ చేరుకొని విచారణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. రాజయ్య కూతురు పంబాల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేందర్ తెలిపారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS