చిన్నారిని బలిగొన్న స్కూల్ బస్సు

Sat,September 14, 2019 07:13 AM

2-year-old girl hit, killed by school bus

వెంగళరావునగర్: నారాయణ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడాదిన్నర పాప బలైంది. సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన బస్సు ఢీకొట్టడంతో చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం .. మహబూ బ్‌నగర్ జిల్లా గార్లపాడుకు చెందిన మంజునాథ్, భార్య శారద దంపతులు నగరానికి వలస వచ్చి బోరబండలోని విజేత థియేటర్ ఎదురుగా ఉన్న గుడిసెల్లో ఉంటున్నారు. ఫుట్‌పాత్ పై రాగి వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తున్నారు. వీరికి కూతురు భవాని (2) సంతానం.

కాగా.. శుక్రవారం సాయంత్రం భవాని గుడిసె నుంచి బయటకు వచ్చి రోడ్డు పక్క ఆడుకుంటుంది. 6.30 గంటల ప్రాంతంలో నారాయణ పాఠశాలకు చెందిన బస్సు వేగంగా దూసు కువచ్చింది. బోరబండ వైపు వెళ్తూ భవానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు బాలికను పంజగుట్టలోని నిమ్స్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు పోలీసులు డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1212
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles