డీసీఎం బోల్తా : ఇద్దరి మృతి

Fri,September 1, 2017 09:44 PM

2 persons died in road accident at balanagar

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బాలానగర్ మండల కేంద్రం సమీపంలోని సర్ఫ్ కంపెనీ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అనంతపూర్‌లో జరగనున్న వివాహ వేడుకకు షామియానా, డెకరేషన్ సామగ్రితో హైదరాబాద్‌కు చెందిన డీసీఎం(ఏపీ 05ఏసీ 3159)లో బీహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులతో బయలుదేరింది. అయితే బాలానగర్ సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ బాబావలీ నిద్రలోకి జారుకోవడంతో డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డీసీఎం వెనుకభాగంలో కూర్చున్న రోహిత్ ముక్య(23), రాజు ముక్య(31)లు అక్కడిక్కడే మృతిచెందగా క్యాబిన్‌లో ఉన్న ఘన్‌శ్యాం ముక్య, మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదస్థలి నుంచి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles