2 కిలోల గంజాయి స్వాధీనంSat,August 12, 2017 09:51 PM
2 కిలోల గంజాయి స్వాధీనం

పెద్దపల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సబ్‌స్టేషన్ సమీపంలోని రహదారిపై శనివారం గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. వారి నుంచి 2 కిలోల 760 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన సర్వం రాము, రాజారామ్ చౌదరి, పంచులాల్ మొండే బతుకు దెరువు కోసం పెద్దపల్లికి వచ్చి, వేర్వేరు షాపుల్లో పని చేస్తున్నారు. అయితే వీరికి వచ్చే జీతం సరిపోకపోవడంతో పంచులాల్ మొండే గంజాయి అమ్మితే డబ్బులు బాగా వస్తాయని మిగతా ఇద్దరికి ఆశ చూపించాడు.

దీంతో మిగతా ఇద్దరూ గంజాయి విక్రయించేందుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో వీరు రాజస్థాన్ నుంచి 2కిలోల760గ్రాముల గంజాయిని తీసుకొని, రైలులో వచ్చి, పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో దిగారు. పక్కా సమాచారం మేరకు సుల్తానాబాద్ పోలీసులు సుగ్లాంపల్లి రహదారి వద్ద తనిఖీలు నిర్వహించగా, ఈ ముగ్గురు వ్యక్తులు బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS