
సంగారెడ్డి: గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీసులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక బైక్, ఒక సైకిల్, రూ. 80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.