11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. శరీరంపై 86 గాయాలు

Sun,April 15, 2018 12:12 PM

11 year old Surat girl raped and body found with 86 injuries in cricket ground

గుజరాత్ : ఉన్నావ్, కతువా సామూహిక అత్యాచార ఘటనలు మరువకముందే మరో దారుణం వెలుగు చూసింది. పదకొండు ఏళ్ల బాలికను వారం రోజుల పాటు అత్యాచారం చేసి.. గొంతు నులిమి చంపిన ఘటన సూరత్‌లో చోటు చేసుకుంది. సూరత్‌లోని బైస్తాన్ ఏరియాలోని క్రికెట్ గ్రౌండ్ వద్ద ఏప్రిల్ 6న బాలిక మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాలికపై 8 రోజుల పాటు అత్యాచారం చేసి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితురాలి శరీరంపై 86 గాయాలు ఉన్నాయని.. ప్రయివేటు భాగాలను తీవ్రంగా గాయపరిచినట్లు నిర్ధారించారు. ఐదు గంటల పాటు పోస్టుమార్టమ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

4196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles