సోమవారం 18 జనవరి 2021
Crime - Oct 27, 2020 , 18:02:12

గ‌విచ‌ర్ల వ‌ద్ద ప్ర‌మాదం.. ప్ర‌యాణికుల‌తో స‌హా బావిలో ప‌డ్డ జీపు

గ‌విచ‌ర్ల వ‌ద్ద ప్ర‌మాదం.. ప్ర‌యాణికుల‌తో స‌హా బావిలో ప‌డ్డ జీపు

వరంగల్ రూరల్ : జిల్లాలోని సంగెం మండలం గవి చర్ల వద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది. జీపులో 16 మంది ప్ర‌యాణికులున్న‌ట్లు సమాచారం. వీరిలో 12 మంది బావిలో నుంచి ఒడ్డుపైకి రాగా మిగిలిన‌వారు జీపులోనే ఉన్నారు. స‌మాచారం తెలిసిన పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. సంఘ‌ట‌న‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.