ఆదివారం 24 జనవరి 2021
Crime - Sep 30, 2020 , 13:32:51

‘యూట్యూబర్‌’ అరెస్ట్

‘యూట్యూబర్‌’ అరెస్ట్

ముంబై : మహిళల పట్ల అసభ్య పదజాలంతో కూడిన వీడియోలు పోస్ట్‌ చేశాడనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల ‘యూట్యూబర్‘ను ముంబై సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఫరీదాబాద్‌ నివాసి సాహిల్‌ అలియాస్‌ ప్రదీప్‌ చౌదరిని సోమవారం అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. చౌదరి యూట్యూబ్‌ చానెల్‌లో వేలాది మంది వినియోగదారులున్నారు. అతను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం, బాలీవుడ్‌లో‌ మాదక ద్రవ్యాల వాడకంపై వీడియోలను కవర్ చేస్తున్నారు. తన వీడియోల్లో మహిళలపై అసభ్య పదజాలం వాడారంటూ ఓ మహిళ ఆగస్టు 22న సైబర్ సె‌ల్‌కు ఫిర్యాదు చేసింది. చౌదరి తాను జర్నలిస్టునని చెప్పగా.. అయితే ఆ వాదన అవాస్తవమని తేల్చారు. గురువారం వరకు పోలీసు కస్టడీలో ఉన్న ఆయనను కోర్టు రిమాండ్ చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo