e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News దారుణం : స్వీట్ ఆశ చూపి బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

దారుణం : స్వీట్ ఆశ చూపి బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

దారుణం : స్వీట్ ఆశ చూపి బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

ల‌క్నో : స్వీట్ ఇస్తామ‌ని న‌మ్మ‌బలికి 13 ఏండ్ల బాలిక‌ను నిర్జ‌న ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న యూపీలో ఆగ్రాకు స‌మీపంలోని శంషాబాద్ గ్రామంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. ఈ విష‌యం పోలీసుల‌కు చెబితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని నిందితుల్లో ఒక‌రి సోద‌రుడు బాలిక‌ను హెచ్చ‌రించాడు.

త‌ల్లితండ్రులు వివాహ వేడుక‌కు వెళ్ల‌గా ఇంటి వ‌ద్ద ఒంట‌రిగా ఉన్న బాలిక‌ను పొరుగున ఉండే బాలుడు (13) స్వీట్ ఇస్తాన‌ని చెప్పి నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకువెళ్లి మ‌రొక నిందితుడు సంజు(22)తో క‌లిసి లైంగిక దాడికి తెగ‌బ‌డ్డారు. ఘ‌ట‌న త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని సంజు సోద‌రుడు మున్నా బాధితురాలి తండ్రిని హెచ్చ‌రించాడు. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితుల‌పై పోక్సో చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దారుణం : స్వీట్ ఆశ చూపి బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

ట్రెండింగ్‌

Advertisement