ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 19:27:52

బాలిక‌ను టీజ్ చేసిన ఆక‌తాయిలు.. న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లూడ‌దీసి మ‌రీ కొట్టిన తండ్రి

బాలిక‌ను టీజ్ చేసిన ఆక‌తాయిలు.. న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లూడ‌దీసి మ‌రీ కొట్టిన తండ్రి

ల‌ఖింపూర్ ఖేరి : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం ల‌ఖింపూర్ ఖేరిలో బాలిక‌ను టీజ్ చేసిన ఆక‌తాయిని తండ్రితో పాటు స్థానికులు చిత‌క‌బాదారు. శ‌నివారం త‌ండ్రితో క‌లిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై ఇంటికి వెళ్తున్న ఓ బాలిక‌ను ఇద్ద‌రు ఆక‌తాయిలు మ‌రో బైక్‌పై వ‌చ్చి టీజ్ చేయ‌డం మొదలు పెట్టారు. తీవ్ర ఆగ్ర‌హానికి గురైన తండ్రి త‌న ద్విచ‌క్ర వాహ‌నాన్ని నిలిపి ప‌రిగెత్తి మ‌రీ ఇద్ద‌రు యువ‌కుల‌ను ప‌ట్టుకున్నాడు. వారిలో ఒక‌డు త‌ప్పించుకొని పారిపోగా మ‌రో యువ‌కుడిని న‌డిరోడ్డుపై చిత‌క‌బాదాడు. 


బాలిక‌ను ఏడిపించ‌డం చూసిన స్థానికులు కూడా పోకిరీపై పిడి గుద్దులు కురిపించారు. బ‌ట్ట‌లూడ‌దీసి మ‌రీ క‌ర్ర‌ల‌తో కుళ్ల‌పొడిశారు. ఆ త‌రువాత 112కు ఫోన్‌చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. ఆక‌తాయిని చిత‌క‌బాదుతున్న‌ప్పుడు స్థానికులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. బాలిక తండ్రి యువ‌కుడిపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వ‌క‌పోవ‌డంతో పోలీసులు ఆక‌తాయిని తిట్టి, త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo