శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 19:19:50

ఫేస్‌బుక్‌లో గొడ‌వ‌.. యువ‌కుడు బ‌లి!

ఫేస్‌బుక్‌లో గొడ‌వ‌.. యువ‌కుడు బ‌లి!

అమృత్‌స‌ర్‌: ప‌ంజాబ్ రాష్ట్రం తార‌న్ త‌ర‌న్ జిల్లాలో దారుణం జ‌రిగింది. పేస్‌బుక్‌లో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చి ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తార‌న్ త‌ర‌న్ జిల్లాలోని ఓ గ్రామంలో పరమ్‌జిత్‌ సింగ్‌ అనే వ్యక్తి మెడికల్ దుకాణం‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతని దుకాణంలో డ్రగ్స్‌ అమ్ముతున్నారని జస్బీర్‌ సింగ్‌ అనే మాజీ సైనికుడు ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్ట‌డం మొద‌లుపెట్టాడు. 

అయితే, తాము ఎలాంటి చట్టవ్యతిరేక ప‌నుల‌కు పాల్ప‌డ‌టం లేద‌ని, డ్రగ్స్‌ అమ్ముతున్నారంటూ త‌మ‌పై అసత్య ఆరోపణలు చేయొద్దని పరమ్‌జిత్‌ సింగ్‌ కొడుకు సుఖ్‌చైన్‌ సింగ్‌ పలుమార్లు జ‌స్బీర్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశాడు. అయినా, జస్బీర్‌ సింగ్‌ వినిపించుకోలేదు. దీంతో ఫేస్‌బుక్‌లో ఇద్ద‌రి మ‌ధ్య చినికిచినికి గాలివాన‌లా మొద‌లైన గొడ‌వ పెద్ద‌దైంది. ఈ నేప‌థ్యంలో జ‌స్బీర్‌సింగ్‌ మంగళవారం ప‌ర‌మ్‌జిత్‌సింగ్ మెడిక‌ల్‌ దుకాణం వద్దకు చేరుకుని గొడవకు దిగాడు. 

దీంతో ఇరువర్గాల మ‌ధ్య మాటామాటా పెరిగి ప‌రిస్థితి కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన జస్బీర్‌ సింగ్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో సుఖ్‌చైన్‌ సింగ్‌  (26) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo