ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 16:43:51

గురువు కోసం త‌ల్లిని హ‌త్య చేసిన త‌న‌యుడు

గురువు కోసం త‌ల్లిని హ‌త్య చేసిన త‌న‌యుడు

ల‌క్నో : త‌న గురువును జైలు శిక్ష నుంచి కాపాడ‌టం కోసం ఓ కుమారుడు.. క‌న్న త‌ల్లేని దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ జిల్లాలో చోటు చేసుకుంది. విశాల్ అనే 22 ఏళ్ల యువ‌కుడు.. ఓ పాఠ‌శాల‌లో పార్ట్ న‌ర్ గా ఉన్నాడు. విన‌య్ అనే యువ‌కుడు కూడా పార్ట్ న‌ర్. అయితే విశాల్, విన‌య్ మ‌ధ్య చోటు చేసుకున్న గొడ‌వ‌.. విన‌య్ ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ కేసులో విశాల్ తో పాటు ఆ పాఠ‌శాల హెడ్ బ్రజేశ్ శ‌ర్మ‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. 

ఆరు నెల‌ల క్రితం విశాల్ బెయిల్ పై విడుద‌ల అయ్యాడు. అయితే త‌న గురువును ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్లాన్ చేశాడు. త‌న త‌ల్లినే చంపి.. బ్రజేష్ ప్ర‌త్య‌ర్థుల‌పై మోపుదామ‌ని భావించాడు. దీంతో ఇరు వ‌ర్గాలు కాంప్ర‌మైజ్ కు వ‌చ్చేసి.. రెండు కేసులు కొట్టేసే అవ‌కాశం ఉంటుంద‌ని విశాల్ అనుకున్నాడు. 

కానీ తాను అనుకున్న‌దొక్క‌టి.. అయిందొక్క‌టి.  త‌ల్లిని తుపాకీతో కాల్చి చంపాడు. ముగ్గురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వ‌చ్చి అమ్మ‌ను చంపేశార‌ని పోలీసుల ఎదుట న‌మ్మ‌బ‌లికాడు. కానీ పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో.. లోతుగా విచారించారు. ఎట్ట‌కేల‌కు తానే అమ్మ‌ను చంపాన‌ని నేరాన్ని అంగీక‌రించాడు. నిందితుడిని రిమాండ్ కు త‌ర‌లించారు. 


logo