గురువారం 21 జనవరి 2021
Crime - Dec 11, 2020 , 08:56:42

పెళ్లి ఊరేగింపులో గొడవ.. యువకుడి హత్య

పెళ్లి ఊరేగింపులో గొడవ.. యువకుడి హత్య

జగిత్యాల: పెళ్లి ఊరేగింపు.. జోరుగా డప్పు చప్పుళ్లు. ఒళ్లు పులకరించిపోయేలా మ్యూజిక్‌. ఇంకేముంది యువత తమను తాము మైమరచిపోయి డ్యాన్స్‌ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఊపులో కొన్నిసార్లు గొడవలు జరిగే సందర్భాలను చూస్తూనే ఉంటాం. అలా పెండ్లి ఊరేగింపులో జరిగిన చిన్పపాటి గొడవ ఓ యువకుని హత్యకు దారితీసింది. 

జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారం గ్రామంలో నిన్న ఓ పెళ్లి వేడుక జరిగింది. సాయంత్రం పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో జరిగిన గొడవ కారణంగా పూదరి లక్ష్మణ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఊరేగింపులో లక్ష్మణ్‌తో పాటు ముగ్గురు యువకులు పాల్గొన్నారు. వారు లక్ష్మణ్‌తో గొడవప పడ్డారు. దీంతో ఆ యువకులు అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


logo