కొత్త బైక్‌పై జాలీ రైడ్‌కు వెళ్లి కాలువలో పడి యువకుడి మృతి

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మోటారు సైకిల్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి ఎన్ఎస్పీ కాలువలో పడటంతో మృతిచెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. యర్ర రాకేశ్(22) అనే యువకుడు మిర్యాలగూడ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. కొవిడ్ నేపథ్యంలో కాలేజీలు బంద్ కావడంతో స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అతని స్నేహితుల్లో ఒకరు కొత్త పల్సర్ బైక్ కొనడంతో రైడ్‌కి వెళ్లాడు.
అధికవేగం కారణంగా అదుపుతప్పడంతో రాయినిపాలెం వద్ద కాలువలో పడ్డాడు. ఈత తెలిసినప్పటికీ బైక్ మీద పడటంతో తనకు తానుగా రక్షించుకోలేక మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కాలువ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
- ఏదైనా జరిగితే మీదే బాధ్యత: సజ్జల
- మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతం: వెంకయ్య
- కశ్మీర్లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర బహిర్గతం
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్‌తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం