మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 11, 2020 , 10:58:57

అమీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

అమీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఉదయం ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. వేగంగా దూసుకెళ్తున్న బైకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీశ్‌ గుప్తా తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. రైలింగ్‌ను కట్‌చేసి గిరీశ్‌ గుప్తాను బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తలరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.