ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 08, 2020 , 16:53:00

గోకార్టింగ్ చేస్తుండ‌గా యువ‌తి త‌ల‌కు గాయం.. మృతి

గోకార్టింగ్ చేస్తుండ‌గా యువ‌తి త‌ల‌కు గాయం.. మృతి

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని గుర్రంగూడలో గోకార్టింగ్ చేస్తుండ‌గా ఓ యువ‌తి త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచింది. వ‌న‌స్థ‌లిపురంలోని ఎఫ్‌సీఐ కాల‌నీకి చెందిన శ్రీ వ‌ర్షిణి అనే యువ‌తి నిన్న సాయంత్రం త‌న స్నేహితుల‌తో క‌లిసి గోకార్టింగ్ చేసేందుకు గుర్రంగూడ వెళ్లింది. గోకార్టింగ్ చేస్తుండ‌గా ఆమె వెంట్రుక‌లు వెనుక టైరులో చిక్కుకోవ‌డంతో కింద ప‌డిపోయింది. వ‌ర్షిణి త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో ఎల్బీన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ గురువారం మ‌ధ్యాహ్నం శ్రీవ‌ర్షిణి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఇంజినీరింగ్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. మృతురాలి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.


logo