శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 18:58:42

వివాహిత అనుమానాస్పద మృతి.. వరకట్న వేధింపులే కారణమా.?

వివాహిత అనుమానాస్పద మృతి.. వరకట్న వేధింపులే కారణమా.?

నోయిడా : ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడా పరిధిలోని బాదల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోవివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం అత్తారింటి వారే ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముసైదా (22) అనే యువతికి బాదల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాడిపూర్ చిడోలి గ్రామానికి చెందిన నదీమ్ (24)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. నాటి నుంచి దంపతులిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోనే నివాసముంటున్నారు. గురువారం రాత్రి ముసైదా కుటుంబంతో కలిసి డాబాపై పడుకుంది. తెల్లవారుజామున ఆమె కదలకపోవడంతో కుటుంబ సభ్యులు చనిపోయిందని గుర్తించారని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరకట్నం కోసం అత్తింటి వారే తమ కూతురుని చంపారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo