సోమవారం 18 జనవరి 2021
Crime - Jan 05, 2021 , 20:09:16

వైరాలో యువతి ఆత్మహత్యాయత్నం

వైరాలో యువతి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం : తనకు బాకీ కింద రూ.4 లక్షలు ఇవ్వాల్సిన ఓ వ్యక్తి అప్పు ఎగవేసేందుకు ప్రయతిస్తున్నాడని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఓ యువతి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరాలోని పాత లంబాడీతండాకు చెందిన భూక్యా సరోజిని వద్ద ఇదే పట్టణానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి రెండేళ్ల కిందట రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి చెల్లించటం లేదు. బాలాజీ మంగళవారం తన ఇంటిని వేరే వారికి విక్రయించేందుకు రిజిస్ట్రేషన్‌ కోసం మంగళవారం వైరాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రాగా సరోజిని అక్కడికి చేరుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుపోగా బ్లూకోల్డ్‌ కానిస్టేబుల్‌, పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించారు. అనంతరం ఆమెను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

న్యూడ్ ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ న‌టి 

ఆర్టీసీ బస్సును ఢీకొని ఒకరి మృతి 

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి