సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 17:35:47

70 ఏండ్ల వృద్ధురాలిపై యువ‌కుడు లైంగిక‌దాడి

70 ఏండ్ల వృద్ధురాలిపై యువ‌కుడు లైంగిక‌దాడి

బల్లియా : కామంతో క‌ళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ప‌దేండ్ల చిన్నారి నుంచి 90 ఏండ్ల వృద్ధురాలి వ‌ర‌కు ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఉత్తర ప్రదేశ్ బల్లియాలో శనివారం 70 ఏళ్ల మహిళపై ఓ యువ‌కుడు లైంగిక దాడికి పాల్ప‌డి తీవ్రంగా  కొట్టాడు. 

హ‌ల్దీ పోలీస్‌స్టేష‌న్ స‌మీపంలోని ఓ కాల‌నీలో 70 ఏండ్ల వృద్ధురాలు ఒంట‌రిగా నివసిస్తోంది. శ‌నివారం తెల్ల‌వారుజాము 4 గంట‌ల స‌మ‌యంలో వృద్ధురాలు నిద్రిస్తుండ‌గా అదే కాల‌నీకి చెందిన 25 ఏండ్ల యువ‌కుడు ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. త‌రువాత ఈ విష‌యం ఎవ‌రికి చెప్పొద్ద‌ని చిత‌క‌బాదాడు. వృద్ధురాలి మేన‌ల్లుడి ఫిర్యాదు మేర‌కు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు న‌మోదు చేశామ‌ని హ‌ల్దీ ఎస్‌హెచ్ఓ సత్యేంద్ర రాయ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo