ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 02, 2020 , 13:50:51

బాలిక గొంతు కోసి చంపిన యువకుడు

బాలిక గొంతు కోసి చంపిన యువకుడు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని పోచారంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికను కరుణాకర్‌ అనే ఓ యువకుడు గొంతు కోసి చంపాడు. అనంతరం చిన్నారి తల్లితో పాటు మరో యువకుడు రమేశ్‌పై కత్తితో దాడి చేశాడు. దాడి ఘటనలో రమేశ్‌ పరారయ్యాడు. కత్తితో దాడి చేసిన అనంతరం కరుణాకర్‌ తాను కూడా గొంతు కోసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే బాలిక తల్లిని, కరుణాకర్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


logo